మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల కారాగార శిక్ష!
- అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నజీబ్ రజాక్
- 210 మిలియన్ రింగెట్స్ ఫైన్ కూడా
- తీర్పు వెల్లడించిన హైకోర్టు న్యాయమూర్తి
ఆరోపణలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి మహమ్మద్ జన్లాన్ ఘాజైల్, నజీబ్ రజాక్ చట్ట విరుద్ధంగా 10 మిలియన్ డాలర్లను పొందారని తేల్చారు. మలేషియా డెవలప్ మెంట్ కు చెందిన బెర్హార్డ్ యూనిట్ ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి ఆయనకు డబ్బు అందిందని, ఆయన దాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించారని తేలిందని తీర్పునిచ్చారు.