అక్టోబరు నాటికి ఆక్స్ఫర్డ్ ‘కొవిషీల్డ్’ టీకా?
- దేశంలో వచ్చే నెలలో తదుపరి ప్రయోగాలు
- ఆక్స్ఫర్డ్ ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు
- అక్టోబరు కాదు డిసెంబరులో వస్తుందన్న సీరమ్ చైర్మన్
ఇక, దేశీయంగా ఉత్పత్తి చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమైంది. కాగా, అక్టోబరు నాటికి ఆక్స్ఫర్డ్ టీకా వస్తుందన్న పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం.
ఆక్స్ఫర్డ్ టీకా తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, ఆస్ట్రియాలో రెండు, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌లో కనీసం వందకోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు.