ఇన్ స్టాగ్రామ్ లో 'బై' చెప్పిన గంటల వ్యవధిలోనే.. కన్నుమూసిన సినీ నటి దివ్యా చౌక్సే!

Bollywood Actress Divya Chowkse Passes Away
  • క్యాన్సర్ తో చాలా కాలంగా పోరాటం
  • ఆమె మరణించారన్న బంధువులు
  • పలు యాడ్స్, టీవీ షోల్లో నటించిన దివ్య
మోడలింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ అవకాశాలను దక్కించుకున్న దివ్యా చౌక్సే, క్యాన్సర్ వ్యాధి సోకి, సుదీర్ఘకాలం చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ కోసం మరణానికి కొన్ని గంటల ముందు ఆమె పెట్టిన ఓ హృదయ విదారక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "క్యాన్సర్ వ్యాధి కారణంగా నేను నెలల తరబడి మరణ శయ్యపై ఉన్నాను. ఇక బై... దివ్యా చౌక్సే" అని పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆమె ఈ లోకాన్ని వీడారు.

ఈ విషయాన్ని ఆమె సమీప బంధువు సౌమ్యా అమిశ్ ధ్రువీకరించారు. దివ్య సహనటుడు సాహిల్ ఆనంద్, తన సందేశాన్ని తెలుపుతూ, "నీ కలలు, అభిరుచులు, ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల మీ నిబద్ధత, సానుకూలత ఓ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో సజీవం. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. కాగా, దివ్యా చౌక్సే 'హై అప్పా దిల్ తోహ్ ఆవారా' చిత్రంతో పాటు పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో, టీవీ షోల్లో కనిపించారు.
Go Back to Shorts
Divya Choukse
Passes Away
Bollywood
Cancer

More Telugu News