ఆసుపత్రుల బిల్లులపై కేంద్రం సీరియస్.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
- వైద్య సేవల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం
- ఆసుపత్రుల్లో చికిత్స చార్జీలను స్పష్టంగా ప్రదర్శించాలని రాష్ట్రాలకు ఆదేశం
- రోగులు ముందే ఖర్చుపై అంచనా వేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదం
- క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం ఈ నిబంధనలు అమలు చేయాలని సూచన
- విదేశీ రోగులకు అందించే ప్యాకేజీ రేట్లను కూడా ప్రదర్శించాలని విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు తమ వద్ద అందించే వైద్య సేవలకు వసూలు చేసే చార్జీలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వైద్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్రం సోమవారం స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆసుపత్రులలో చార్జీల ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో సమీక్షించాలని, రోగులకు, వారి సహాయకులకు చార్జీల వివరాలు సులభంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె తన లేఖలో కోరారు.
చికిత్స ఖర్చులను పారదర్శకంగా ప్రదర్శించడం వల్ల రోగులు, వారి కుటుంబసభ్యులు వైద్యానికి అయ్యే వ్యయంపై ఒక అంచనాకు రాగలరని, తద్వారా ఆర్థికంగా ముందే ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇది బిల్లింగ్ విషయంలో తలెత్తే వివాదాలను తగ్గించి, వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొంది.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2010, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012 ప్రకారం, ఈ చట్టం వర్తించే రాష్ట్రాల్లోని వైద్య సంస్థలు అందించే అన్ని సేవలు, సౌకర్యాల చార్జీలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఈ వివరాలను ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషలో కూడా అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి గుర్తు చేశారు. కేంద్ర చట్టం వర్తించని రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనల ప్రకారం చార్జీల ప్రదర్శనను తప్పనిసరి చేయాలని సూచించారు.
ఇదే సమయంలో భారత్‌లో చికిత్స కోసం వచ్చే విదేశీ రోగుల విషయంలోనూ పారదర్శకత పాటించాలని కేంద్రం కోరింది. మెడికల్ లేదా ఆయుష్ వీసాలపై వచ్చే వారికి అందించే ప్యాకేజీ రేట్లను కూడా ప్రముఖంగా ప్రదర్శించేలా ఆసుపత్రులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. దీనివల్ల విదేశీ రోగులు సరైన నిర్ణయం తీసుకోవడానికి, ధరల విషయంలో ఫిర్యాదులు తగ్గించడానికి వీలవుతుందని, వైద్య రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.