హీరో విజ‌య్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోను చేసి కంగారు పెట్టించిన గుర్తు తెలియని వ్యక్తి!
Add ap7am to your home Screen

హీరో విజ‌య్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోను చేసి కంగారు పెట్టించిన గుర్తు తెలియని వ్యక్తి!

police receives fake call about bomb in vijays home
  • గత అర్ధరాత్రి పోలీసులకు ఫోన్‌
  • బాంబు స్క్వాడ్‌తో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు
  • బాంబు లేదని తేల్చిన పోలీసులు
త‌మిళ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్ చేయడంతో కలకలం చెలరేగింది. గత అర్ధరాత్రి పోలీసులకు ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి సాలగ్రామంలోని విజ‌య్ ఇంట్లో బాంబ్ ఉందని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పాడు. ఈ ఫోన్ కాల్ అందుకున్న వెంట‌నే  పోలీసులు బాంబు స్క్వాడ్‌తో ఆయన ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే, ఆయన ఇంటి వద్ద బాంబు లేక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే సినీనటుడు రజనీకాంత్‌ నివాసంలో బాంబు ఉందని పేర్కొంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇదే విధంగా ఫోను చేసి చెప్పాడు. అయితే, ఆయన ఇంట్లో బాంబు లేదని పోలీసులు తేల్చి, ఈ పని చేసింది మ‌తిస్థిమితం లేని ఓ ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థి అని గుర్తించారు.
vijay
bomb

More Telugu News