నేలరాలుతున్న చైనా డ్రోన్లు... టెక్నాలజీ విశ్వసనీయతపై సందేహాలు
- పలు దేశాలకు డ్రోన్లు ఎగుమతి చేస్తున్న చైనా
- చైనా నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తున్న పాక్, ఇరాక్, అల్జీరియా
- అల్జీరియాలో ఇటీవలే కూలిన మూడు డ్రోన్లు
చైనా నుంచి డ్రోన్లను కొనుగోలు చేసిన దేశాల్లో పాకిస్థాన్, అల్జీరియా, ఇరాక్ వంటి దేశాలున్నాయి. ఇటీవలే అల్జీరియా పెద్ద సంఖ్యలో చైనా డ్రోన్లను దిగుమతి చేసుకుంది. వాటిలో మూడు డ్రోన్లు ఇటీవలే నేలరాలాయి. ఇలా వరుసగా చైనా డ్రోన్లు కూలిపోతుండడంతో, చైనా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, అంతర్జాతీయంగా ఓ అంశం విపరీతంగా ప్రచారంలో ఉంది. దాని సారాంశం ప్రకారం.... చైనా డ్రోన్ తయారీ టెక్నాలజీని ఇరాన్ నుంచి పొందింది. ఈ సాంకేతికతను ఉపయోగించే చైనా డ్రోన్లు తయారుచేస్తోందట.