'ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి' అంటూ తన ఫొటో పోస్ట్ చేసిన మెగా హీరో వరుణ్ తేజ్

'ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి' అంటూ తన ఫొటో పోస్ట్ చేసిన మెగా హీరో వరుణ్ తేజ్

varun tej post interesting pic
  • కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులపై వరుణ్ స్పందన
  • పింక్ కలర్‌లో బ్ల‌ర్‌గా ఉన్న ఫొటో పోస్ట్
  • ప్రణాళికలన్నీ ఫొటోలో మాదిరిగా బ్లర్ అయ్యాయన్న హీరో 
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. చాలా మందికి ఉపాధి కరవైపోతోంది. సినీ పరిశ్రమను కరోనా కుంగదీసింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులను వర్ణించేలా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

పింక్ కలర్‌లో బ్ల‌ర్‌గా ఆయన ఫొటో కనపడుతోంది. ఈ ఏడాది వేసుకున్న ప్రణాళికలన్నీ ఫొటోలో మాదిరిగా బ్లర్ అయ్యాయని చెబుతూ దీన్ని పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ మెగా హీరో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.
Varun Tej
Viral Pics
Tollywood

More Telugu News