ప్రొడ్యూసర్ తలచుకుంటే ఏమైనా చేస్తాడు... నన్ను చాలా హింసించారు: తమిళ సినీ నటి విద్యా ప్రదీప్
- కారణం లేకుండా ఆరు చిత్రాల నుంచి తీసేశారు
- ఆ సమయంలో హృదయం పగిలిపోయింది
- తన జీవితంలోని అనుభవాలను వివరించిన విద్య
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, ప్రొడ్యూసర్లు తలచుకుంటే ఏమైనా చేస్తారని, తనకు వరుసగా ఆరు చిత్రాల్లో అవకాశాలను పోగొట్టారని, కారణాలు లేకుండా తీసేయడంతో తన హృదయం పగిలిపోయిందని, ఈ రంగం సరిపడదని భావించిన సమయంలో 'తడమ్' చిత్రంలో అవకాశం వచ్చిందని చెప్పింది. ఆ సినిమాలో కూడా చాలా భయపడుతూనే నటించానని చెప్పిన విద్య, సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కష్టాలు మరింతగా ఉంటాయని, ఒక్కరు కూడా పట్టించుకోరని వాపోయింది. కఠోర శ్రమ, స్వీయ నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చని వ్యాఖ్యానించింది.