చైనా మిలటరీ అధికారిపై భారత జవాను పిడిగుద్దులు... వీడియో ఇదిగో
- సిక్కిం సమీపంలో మంచుకొండల మధ్య ఘటన
- ఒకరిపై ఒకరు బాహాబాహీ
- వైరల్ అవుతున్న వీడియో
ఇరు పక్షాలూ "గో బ్యాక్", "డోంట్ ఫైట్" అంటున్న నినాదాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. నేలంతా మంచు నిండిపోయి కనిపిస్తుండగా, చైనా, భారత్ సైనికులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. కొంతసేపటి తరువాత వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఎప్పటిదన్న విషయమై స్పష్టత లేదు. ఎవరు షూట్ చేశారన్న విషయం కూడా తెలియరాలేదు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.