మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు

Case filed on Bhuma Akhilapriya brother
  • పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లిన జగత్ విఖ్యాత్ రెడ్డి
  • అఖిల ప్రియ నివాసానికి వెళ్లి నిందితుడిని మళ్లీ తీసుకొచ్చిన పోలీసులు
  • స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ కేసు నమోదు
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో పొలం దారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో, ఇరు వర్గాలను పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు.

అయితే, పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ ను బలవంతంగా పీఎస్ నుంచి అఖిలప్రియ సోదరుడు తీసుకెళ్లారు. దీంతో, హుటాహుటిన అఖిలప్రియ నివాసానికి వెళ్లి, సదరు నిందితుడిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 224, 225, 212 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
Bhuma Akhilapriya
Brother
Jagath Vikhyath Reddy
Arrest

More Telugu News