కమలహాసన్ తో డేటింగ్ పై నటి పూజా స్పందన
- కమల్ చాలా కాలంగా నాకు తెలుసు
- వారి కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం ఉంది
- డేటింగ్ వార్తల్లో నిజం లేదు
తామిద్దరం డేటింగ్ చేస్తున్నామనే వార్తలను పూజ ఖండించారు. చాలా ఏళ్లుగా కమల్ తనకు తెలుసని.. ఆయన కుటుంబ సభ్యులతో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అందుకే వారి ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా కనిపిస్తుంటానని తెలిపారు. కమల్ తదుపరి చిత్రం 'తలైవన్ ఇరుక్కిరన్'లో తాను నటించబోతున్నానే వార్తలో నిజం లేదని చెప్పారు.
పూజా కుమార్ తెలుగు చిత్రంలో కూడా నటించారు. 'గరుడవేగ' చిత్రంలో రాజశేఖర్ భార్యగా ఆమె కనిపించారు.