ఫ్లైట్ క్రాష్ లో నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: పాకిస్థాన్ నటి
- పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం
- నటి అయేజా, ఆమె భర్త మరణించారని వార్తలు
- విమానంలో తాము లేమని ప్రకటించిన అయేజా
ఈ వార్తలను అయేజా ఖాన్ ఖండించింది. తాను బతికే ఉన్నానని తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తాము లేమని తెలిపింది. ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది.