ఒక్క సీన్ షూట్ చేస్తే 'క్రాక్' పూర్తయినట్టే
- రవితేజ నుంచి రానున్న 'క్రాక్'
- మరోసారి జోడీ కడుతున్న శ్రుతి హాసన్
- ఈ ఏడాది చివర్లో విడుదల
శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో విడుదల చేయాలని భావిస్తున్నారట. గతంలో రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటించిన 'బలుపు' విజయాన్ని సాధించింది. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి తలెత్తుతోంది. ఇక చాలా గ్యాప్ తరువాత శ్రుతి హాసన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అందువలన ఆమె అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు రవితేజ .. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా విజయాలను అందుకోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.