వెబ్ సిరీస్ దిశగా వెంకటేశ్?

Teja Web Series
  • జోరందుకుంటున్న వెబ్ సిరీస్ లు
  •  ఆసక్తిని చూపుతున్న వెంకటేశ్
  • తేజతో సురేశ్ బాబు చర్చలు
ట్రెండ్ మారుతోంది .. వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతోంది. హాలీవుడ్ .. బాలీవుడ్ మొదలు అన్ని ప్రాంతాల వారు వెబ్ సిరీస్ లపై ఆసక్తిని చూపుతున్నారు.  సినిమాల్లో అవకాశాలు తగ్గినవారు మాత్రమే వెబ్ సిరీస్ లపై దృష్టి పెడతారనే అభిప్రాయాలను తుడిచేస్తూ, స్టార్ డమ్ వున్న ఆర్టిస్టులు సైతం వెబ్ సిరీస్ లను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరంజీవితో ఆయన పెద్ద కూతురు ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు వెంకటేశ్ పేరు వినిపిస్తోంది. వెబ్ సిరీస్ లను ఫ్యామిలీస్ ఎక్కువగా చూస్తుండటంతో, వెంకటేశ్ తో ఒక వెబ్ సిరీస్ మొదలెడితే ఎలా ఉంటుందా అని సురేశ్ బాబు ఆలోచన చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఆయన దర్శకుడు తేజతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు ఫలిస్తే ఓటీటీ ప్లాట్ ఫామ్ పై స్టార్స్ సందడి కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Venkatesh
Suresh Babu
Teja

More Telugu News