హను రాఘవపూడికి దుల్కర్ గ్రీన్ సిగ్నల్!
- మలయాళంలో దుల్కర్ కి విపరీతమైన క్రేజ్
- నేరుగా తెలుగులో సినిమాకి సన్నాహాలు
- లాక్ డౌన్ తరువాత రెగ్యులర్ షూటింగ్
ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. ఇటీవలే హను రాఘవపూడి ఆయనకి కథను వినిపించగా , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. 'మహానటి' సినిమాను నిర్మించిన 'స్వప్న సినిమా' వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. కథానాయికతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.