మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Shiva Nirvana Movie
  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'ఫైటర్'
  • తదుపరి సినిమా దర్శకుడిగా శివ నిర్వాణ
  • మరో డిఫరెంట్ మూవీకి సన్నాహాలు
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'ఫైటర్' రూపొందుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణపరంగా చివరి దశకి చేరుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత శివ నిర్వాణతో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ సినిమాకి నిర్మాత 'దిల్' రాజు కాదని విజయ్ దేవరకొండ అన్నాడు.

ఇక ఆ తరువాత సినిమాను ఓ యువ దర్శకుడితో చేయనున్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు. కథ కొత్తగా .. కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అన్నాడు. ఈ ప్రాజెక్టు గురించి అప్పుడే చెబితే మజా ఉండదనీ, త్వరలో చెబుతానని అన్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ డిఫరెంట్ మూవీ ఏదో చేయనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.
Go Back to Shorts
Vijay Devarakonda
Puri Jagannadh
Shiva Nirvana Movie

More Telugu News