19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్న సూర్య
- గతంలో 13 ఏళ్ల కుర్రాడిగా అలరించిన సూర్య
- సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా'
- యువకుడిగా కనిపించడం కోసం కసరత్తులు
సుధ కొంగర దర్శకత్వంలో జీఆర్ గోపీనాథ్ బయోపిక్ లో సూర్య నటిస్తున్నాడు. తమిళంలో 'సురరైపోట్రు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో సూర్య కొంత సేపు 19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట. అలా కనిపించడం కోసం ఆయన గట్టి కసరత్తులే చేసినట్టు సమాచారం. 44 ఏళ్ల సూర్య .. తెరపై 19 ఏళ్ల యువకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.