మరో వివాదంలో చిక్కుకున్న రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ!
- గత నెలలో అదృశ్యమై కలకలం రేపిన నారాయణ
- తాజాగా నాగులవరం గ్రామంలో హల్ చల్
- చిల్లర కొట్టు యజమానిపై ప్రతాపం చూపిన ఎస్ఐ
ఇప్పుడా విష్ణు నారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధుల్లో ఉన్న విష్ణు, నాగులవరం గ్రామంలో ఓ చిల్లర కొట్టు యజమానిని చితకబాదాడు. అతని షాపులోని సరుకులను వీధిలో పడేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా, అది వైరల్ అయింది. ఎస్ఐ చర్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్థానికులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.