అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి: గో ఎయిర్
- దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్
- పార్కింగ్ లో వున్న 650 విమానాలు
- విమానాలతోపాటు సిబ్బందినీ సమకూర్చేందుకు గో ఎయిర్ సిద్ధం
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అన్ని సంస్థలకు చెందిన దాదాపు 650 విమానాలు పార్కింగ్ లో వున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలకు తమ విమానాలను వినియోగించుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి సూచించింది.