పారితోషికాన్ని పెంచుకుంటూపోతున్న పూజ హెగ్డే
- వరుస సినిమాలతో బిజీ
- వరుస విజయాలతో క్రేజ్
- పవన్ సినిమాలోను ఛాన్స్?
అఖిల్ కి జోడీగా ఆమె చేసిన సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, ప్రభాస్ తో సినిమా సెట్స్ పై వుంది. ఇక హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోను కథానాయికగా ఆమె పేరే వినిపిస్తోంది. ప్రభాస్ .. పవన్ సరసన సినిమాలు హిట్ అయితే పూజ హెగ్డే పారితోషికం రెట్టింపు అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి పూజ హెగ్డేకి పోటీ ఇచ్చే కథానాయికలు దగ్గరలో లేరు. కనుక ఆమె జోరు మరికొన్నాళ్ల పాటు సాగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.