షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చిన కమెడియన్ ప్రియదర్శి.. స్వీయ గృహ నిర్బంధం!

Tollywood comedian Priyadarshi self House arrest
  • జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్
  • తన షూటింగ్ ముగించుకుని వచ్చిన ప్రియదర్శి
  • నటుడి నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు
తెలుగు కమెడియన్ ప్రియదర్శి తనను తాను స్వీయ నిర్బంధం చేసుకున్నాడు. ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా షూటింగు కోసం జార్జియా వెళ్లిన ప్రియదర్శి, తన షూటింగ్ అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షల అనంతరం నేరుగా ఇంటికి చేరుకున్న ప్రియదర్శి 14 రోజులపాటు బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వైద్యుల సూచన మేరకు 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నట్టు తెలిపాడు. ప్రియదర్శి నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
Go Back to Shorts
Prabhas
Priyadarshi
Comedian
Tollywood
Corona Virus

More Telugu News