విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై విచారణ ఈ నెల 12కి వాయిదా
- విశాఖలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రను అడ్డుకున్న ఆందోళకారులు
- చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు
- పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నేత శ్రవణ్ కుమార్
చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు ఏ విధంగా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి స్పష్టం చేశారు. అనంతరం విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. డీజీపీని కూడా అదే రోజున హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. అనుమతి ఇచ్చినందునే చంద్రబాబు ప్రజాచైతన్యయాత్రలో పాల్గొనేందుకు విశాఖ వచ్చారని, అలాంటప్పుడు ఆయన పర్యటనను నిలిపివేసి వెనక్కి ఎలా పంపుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.