Advertisement

కవల సోదరులకు కవల సోదరీమణులతో పెళ్లి.. వేడుకను నిర్వహించిన కవల ఫాదర్లు

Twin brothers marry twin sisters ceremony conducted by twin priests
  • కేరళలో కవలల అరుదైన వివాహం
  • చర్చిలో కవల ఫాదర్స్ ఆధ్వర్యంలో పెళ్లి
  • పెళ్లిలో అందరూ కవలలే ఉండాలన్నది వధువుల కల
  • జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమన్న ఫాదర్స్‌
  • వరులు నేవీలో, వధువులు ఐటీలో ఉద్యోగులు
కేరళలోని కొట్టాయం జిల్లా చంగనాశేరిలో అరుదైన వివాహ వేడుక అందరి దృష్టినీ ఆకర్షించింది. కవల సోదరులు కవల యువతులను వివాహం చేసుకున్నారు. అంతటితో అయిపోలేదు. క్రైస్తవులైన వీరి పెళ్లిని చర్చిలో కవల ఫాదర్స్‌ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చంగనాశేరి మెట్రోపాలిటన్ చర్చిలో గురువారం జరిగిన ఈ వేడుకలో అఖిల్ కె. థామస్-మాగీ మేరీ థామస్, నిఖిల్ కె. థామస్-మరియా మేరీ థామస్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకను కంజిరప్పల్లి డయోసిస్‌కు చెందిన ఫాదర్ ఆంటో పెజుమ్కట్టిల్, ఫాదర్ అజో పెజుమ్కట్టిల్ నిర్వహించారు. అలాగే కవల బాలురు జెరాన్ జేమ్స్, జోహన్ జేమ్స్ చర్చి సేవకులుగా పాల్గొన్నారు.

అఖిల్, నిఖిల్‌లు చంగనాశేరిలోని వెట్టుపరంబిల్‌కు చెందిన కుంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కుమారులు. మాగీ, మారియాలు పతనంతిట్ట జిల్లా కులత్తూరుకు చెందిన టోమిచన్, మేరీకుట్టి దంపతుల కుమార్తెలు. తమ పెళ్లిలో ప్రధాన పాత్రలన్నీ కవలలే ఉండాలన్నది చిన్ననాటి కల అని వధువులు తెలిపారు. కవల ఫాదర్స్‌ కోసం ప్రత్యేకంగా వెతికి, చివరకు కొథనల్లూర్ చర్చి ద్వారా వారిని సంప్రదించినట్లు చెప్పారు. తమ ఆహ్వానాన్ని వాళ్లు వెంటనే అంగీకరించారని వెల్లడించారు.

ఈ వివాహంలో పాల్గొనడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని ఫాదర్స్‌ అన్నారు. తామూ కవలలుగానే జన్మించి, కలిసి ప్రభువు సేవలోకి వచ్చామని, ఇప్పుడు కవల జంటల వివాహాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వరులిద్దరూ ప్రస్తుతం మర్చంట్ నేవీలో ఉద్యోగాలు చేస్తుండగా, వధువులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల చిన్ననాటి కోరిక నెరవేరడంతో ఈ వివాహం స్థానికంగా విశేష ఆకర్షణగా మారింది.
Advertisement
Akhil K Thomas
Twin brothers marry twin sisters
Kerala twin wedding
Father Anto Pezumkattil
Changanassery Metropolitan Church
Unique Kerala wedding

More Telugu News