CAA: ఇంట్లోకి వచ్చి నా కూతుళ్లను లైంగికంగా వేధించారు.. అందుకే బిల్డింగ్‌ పై నుంచి దూకేశాం: ఢిల్లీ అల్లర్ల బాధితురాలు

jumped from building
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో కొనసాగుతున్న హింసలో బాధితులు పడ్డ వేదన వర్ణనాతీతం. తాము ఎదుర్కొన్న భయంకర అనుభవాలను బాధితులు మీడియాకు వివరిస్తున్నారు. తమ ఇంట్లోకి రాత్రి సమయంలో ఒక గుంపు ప్రవేశించి తనను, తన ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించారని ఓ మహిళ తెలిపింది. దీంతో భయంతో వణికిపోయామని, చివరకు శరీరానికి దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశామని చెప్పింది.

చివరకు చెత్త ఏరుకుని బతికే వారిని కూడా అల్లరి మూకలు వదలట్లేదు. చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లిన షబ్బీర్‌ అనే యువకుడిపై అల్లరి మూకలు దాడిచేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. తమది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కాబట్టి అల్లర్లు జరుగుతున్నప్పటికీ చెత్త ఏరుకోవడానికి తన కుమారుడు వెళ్లాడని, దీంతో ఏమీ తెలియని తన అమాయక కొడుకుపై దాడి చేశారని సల్మాన్ అనే వ్యక్తి తెలిపాడు. రోడ్డుపై కనిపించిన వారిని పట్టుకుని పేరు, మతం అడిగి కొందరు దారుణంగా కొడుతున్నారు.
Go Back to Shorts
CAA
Crime News
New Delhi

More Telugu News