మరోసారి జట్టు కడుతున్న హిట్ కాంబినేషన్
- సూర్యకి విపరీతమైన క్రేజ్
- గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్
- ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ
సూర్య కోసం గౌతమ్ మీనన్ ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. ఇంతవరకు సూర్య చేయని పాత్రను ఆయన డిజైన్ చేశాడని చెబుతున్నారు. వారం పది రోజుల్లో ఈ కథను సూర్యకు వినిపించనున్నాడని సమాచారం. ఆల్రెడీ లైన్ వినేసి ఓకే చెప్పిన సూర్య, పూర్తి కథను వినేసిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఖాయమని చెబుతున్నారు. గౌతమ్ మీనన్ పట్ల సూర్యకి గల ప్రత్యేక అభిమానం ఈ ప్రాజెక్టును ఓకే చేయడానికి మరో కారణమని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.