ఆ విషయం నేర్చుకోవాలంటే జగన్, విజయసాయిరెడ్డి వద్దకు ట్యూషన్‌కు వెళ్లాలి: బుద్ధా వెంకన్న
- వేల కోట్ల రూపాయల స్కామ్‌లు ఎలా చేయాలో నేర్పుతారు
- దొంగే 'దొంగ దొంగ' అని అరుస్తున్నట్లు వైసీపీ నేతల తీరు ఉంది
- సూట్ కేసు కంపెనీల్లో జగన్.. 43 వేల కోట్లు దాచుకున్నారు
దొంగే 'దొంగ దొంగ' అని అరుస్తున్నట్లు వైసీపీ నేతల తీరు ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. సూట్ కేసు కంపెనీల్లో జగన్.. 43 వేల కోట్లు దాచుకున్నారని, ఇటువంటి వారు టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.