పూటకొక జఫ్ఫా వచ్చి తాడేపల్లిలో కూర్చుని ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారు: బొండా ఉమ
- రాష్ట్రంలో ఐటీ దాడులు
- వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం
- చంద్రబాబు వద్ద లక్షల కోట్లు దొరుకుతాయంటూ వైసీపీ నేతల వ్యాఖ్యలు
- ఘాటుగా బదులిచ్చిన బొండా ఉమ
"మాజీ పీఎస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికితే చంద్రబాబు వద్ద లక్షల కోట్లు దొరుకుతాయి అంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై చంద్రబాబును, లోకేశ్ ను విచారించాలంట! అవినీతి పునాదులపైనే పుట్టిన వైసీపీ ఆ అవినీతి మరకలను టీడీపీకి కూడా అంటించాలని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతోనే మీ విశ్వసనీయత ఏంటో బట్టబయలైంది" అంటూ ధ్వజమెత్తారు.