చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై ఐటీశాఖ పంచనామాలో కీలక విషయాలు!
- పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐదు రోజులపాటు సోదాలు
- రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు వైసీపీ నేతల ఆరోపణలు
- వాస్తవం కాదని తేల్చేసిన ఐటీ శాఖ పంచనామా
బయటకు వచ్చిన నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన దాడుల్లో రూ.2 వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయన్న దాంట్లో నిజం లేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు మాత్రమే లభ్యమైనట్టు పంచనామా నివేదికలో ఐటీ పేర్కొంది. సోదాల సందర్భంగా లభ్యమైన బంగారు ఆభరణాలను సీజ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు.