చదవడం వచ్చిన వారితో ఐటీ ప్రెస్ నోట్ ను చదివించుకోండి: బుద్దా వెంకన్న కౌంటర్
- చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికాయని తెగ సంబరపడిపోతున్నారు
- ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది జగన్, వైసీపీ నేతలే అనే విషయం అర్థమవుతోంది
- బ్లాక్ పేపర్, ఛానలో వార్తలు చూస్తుంటే నవ్వొస్తోంది
'మూడు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా దాడి చేశామని ఐటీ అధికారులు ప్రకటన ఇచ్చారు. బోడి గుండుకి, మోకాలికి ముడి పెట్టినట్టు... ఇన్ఫ్రా కంపెనీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని ఐటీ అధికారులు అంటే... చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికేశాయని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ ను చదవడం వచ్చిన వాళ్లతో చదివించుకోవాలని కోరుతున్నానని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.