లైఫ్ లో ప్రేమనేది వుండాలి: హీరో విజయ్ దేవరకొండ
- ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి
- డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాను
- యూత్ కి నచ్చుతుందన్న విజయ్ దేవరకొండ
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి .. ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. గెటప్స్ పరంగా .. పాత్రల మధ్య వేరియేషన్స్ ను చూపించేపరంగా చాలా కేర్ తీసుకోవలసి వచ్చింది. ఈ సినిమా చేయడానికి ముందు ప్రేమ అనేది ఒక నాన్ సెన్స్ అనుకున్నాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు లైఫ్ లో ప్రేమ అనేది వుండాలనిపించింది. అప్పుడే లైఫ్ అందంగా .. అర్థవంతంగా ఉంటుందనిపించింది. యూత్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.