ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి
- కొచ్చిలో శవమై తేలిన కేజే జస్టిన్
- కొచ్చి బ్యాక్ వాటర్స్ లో మృతదేహం
- చర్చికి వెళ్లి తిరిగి రాని కేజే జస్టిన్
జస్టిన్ చర్చికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు ఏసుదాస్ మాదిరే జస్టిన్ కూడా సంగీత రంగంలో ఉన్నారు. రచయిత కూడా అయిన జస్టిన్ ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంగిపోయినట్టు చెబుతున్నారు. కొంతకాలం కిందట జస్టిన్ కొడుకు మరణించడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం ఆయన్ను వేదనకు గురిచేసి ఉంటాయని, ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.