'కియా తరలింపు'పై సీఎం జగన్ సమాధానం చెప్పాలి: ప్రత్తిపాటి పుల్లారావు
- అమరావతి రైతుల దీక్షకు ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు సంఘీభావం
- కియా పరిశ్రమను తరలిస్తున్నారన్న ప్రచారంపై స్పందన
- వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని విమర్శ
కియా పరిశ్రమను అనంతపురం నుంచి వేరే రాష్ట్రానికి ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఇన్ని రోజులుగా చేస్తోన్న ఆందోళనను జగన్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని నక్కా ఆనంద బాబు విమర్శించారు. కియా వంటి పరిశ్రమలు తరలిపోవడం రాష్ట్రానికి నష్టమని చెప్పారు.