బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి.. అయితే అతనితో కలసి పనిచేయాలని ఉంది: వరుణ్ తేజ్
- షారుఖ్ ఖాన్ కు నేను పెద్ద ఫ్యాన్
- ఆయనతో కలిసి పని చేయాలని ఉంది
- ఏ భాషలో నటించడానికైనా నేను సిద్ధమే
తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని... కానీ కథ నచ్చక కొన్ని, షెడ్యూల్ సహకరించక మరికొన్ని చిత్రాలను తిరస్కరించానని వరుణ్ తేజ్ చెప్పాడు. కథలో సత్తా ఉంటే ఏ భాషలో నటించడానికైనా తాను సిద్ధమేనని తెలిపాడు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉందని అన్నాడు. సినిమాలకు భాష, ప్రాంతీయ భేదాలు అడ్డురావనే విషయం 'బాహుబలి'తో రుజువయిందని చెప్పాడు.