అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు: బీజేపీ నేత రఘునందన్ పై బాధితురాలి ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు: బీజేపీ నేత రఘునందన్ పై బాధితురాలి ఆరోపణ

  • రాజకీయ నాయకులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు
  • అతనితో పాటు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు కూడా 
  • హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేవారు 
బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. రఘునందన్‌పై ఆరోపణలు చేసిన బాధితురాలు ఈ రోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. రఘునందన్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులు సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలతో 2012లో తాను కేసు పెట్టానని, దీంతో తనపై కక్ష పెట్టుకుని తనను చంపేందుకు రఘునందన్ యత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో విసిగిపోయానని, అందుకే, హెచ్ఆర్సీని ఆశ్రయించానని చెప్పారు. అమ్మాయిల జీవితాలను వీళ్లు నాశనం చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ ను రఘునందన్ సప్లై చేయించేవాడని, ముంబయిలో దీనికి సంబంధించిన ఓ యూనిట్ ఉందని ఆమె ఆరోపించారు. ఆధారాలతో సహా తాను పట్టిస్తే సీసీఎస్ పోలీసులు ఆ కేసును మూసేశారని విమర్శించారు. ఈ విషయమై పోలీసులను తాను ప్రశ్నిస్తే, ‘రఘునందన్ చెప్పాడు, మేము క్లోజ్ చేస్తాం. నువ్వు ఏమన్నా ఎక్కువ మాట్లాడావంటే ఎన్ కౌంటర్ చేస్తాం’ అని సీఐ రాజశేఖర్ రెడ్డి తనను పబ్లిక్ గా ఎన్నోమార్లు బెదిరించారని ఆరోపించారు. తాను ఎక్కడ కేసు పెట్టాలనుకున్నా రఘునందన్, సీఐ రాజశేఖర్ రెడ్డి అక్కడి వాళ్లకు ఫోన్ చేసి కేసు నమోదు కాకుండా చేసేవాళ్లను ఆరోపించారు.
Raghunandan
BJP
molestation
Raviteja

More Telugu News