'ఇలాంటి వారిని సమాజం నుంచే వెలివేయాలి'.. బీజేపీ ఎంపీపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
- దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు గాంధీ
- గాంధీని కించపరచడమంటే దేశస్థాయిని తగ్గించుకోవడమే
ఈ క్రమంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ.. 'శాంతి, అహింసకు ప్రపంచానికే రోల్ మోడల్ మహాత్మాగాంధీ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు. ప్రపంచస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చినాయనను కించపరచడమంటే దేశస్థాయిని తగ్గించుకోవడమే. గాంధీని అవమానించేలా మాట్లాడిన వారిని పార్టీల నుంచే కాదు సమాజం నుంచే వెలివేయాలి' అని ట్వీట్ చేశారు.