వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జగన్

  • పిటిషన్‌లో చోటుచేసుకున్న తప్పులు 
  • వాటిని సరిచేసి మళ్లీ దాఖలు చేయనున్న న్యాయవాదులు
  • నిన్నటి విచారణకు హాజరు కాని జగన్
ఏపీ ముఖ్యమంత్రిగా పాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సి ఉండడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జగన్ వెనక్కి తీసుకున్నారు. పిటిషన్‌లో తప్పులు దొర్లాయని పేర్కొన్న జగన్ తరపు న్యాయవాదులు.. వాటిని సరిదిద్దిన అనంతరం తిరిగి పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

అక్రమాస్తుల కేసులో నిన్నటి విచారణకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉండగా ఆయన కోర్టుకు రాలేదు. జగన్ తరపు న్యాయవాది వేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను అనుమతించిన సీబీఐ కోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.
Go Back to Shorts
YS Jagan
CBI
Nampally court
Andhra Pradesh

More Telugu News