అప్పట్లో నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చాలామంది చెన్నై వచ్చేవారు: హీరో సుమన్
Add ap7am to your home Screen

అప్పట్లో నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చాలామంది చెన్నై వచ్చేవారు: హీరో సుమన్

  • లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేవి 
  •  ఎవరినీ ఎంకరేజ్ చేసేవాడిని కాదు 
  •  సినిమా వేరు .. జీవితం వేరని చెప్పేవాడినన్న సుమన్  
తెలుగు తెరపై ఆరడుగుల అందంతో ఆకట్టుకున్న హీరోల్లో సుమన్ ఒకరు. అప్పట్లో ఆయనకి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు. "అప్పట్లో చాలామంది అమ్మాయిలు నాకు రక్తంతో లెటర్స్ రాసేవారు. అలాంటివాళ్లను నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు.

ఇలాంటి పనులు చేయవద్దు .. నటన అనేది నా వృత్తి .. నా పనిని నేను చేసుకు వెళుతున్నాను. మీ పని ఏదైతే వుందో దానిపై దృష్టి పెట్టండి అని రిప్లై ఇచ్చేవాడిని. ఇక కొంతమంది అమ్మాయిలైతే నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చెన్నైలో మా ఇంటికి వచ్చేసేవారు. అదోరకం అమాయకత్వమని నాకు తెలుసు. సినిమా వేరు .. జీవితం వేరు అని వాళ్లకి మా మేనేజర్ నచ్చజెప్పేవారు. కొంతమందిని వాళ్ల ఇంటివరకూ తీసుకెళ్లి పేరెంట్స్ కి అప్పగించిన సందర్భాలు కూడా వున్నాయి" అని చెప్పుకొచ్చారు.
Suman
Ali
Alitho Saradaga

More Telugu News