టెన్షన్ పడుతున్న 'డిస్కోరాజా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెన్షన్ పడుతున్న 'డిస్కోరాజా'

  • 'డిస్కోరాజా'గా వస్తున్న రవితేజ
  • భారీ ఓపెనింగ్స్ రాబట్టవలసిన అవసరం  
  • ఆశించిన స్థాయిలో దొరకని థియేటర్లు
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన 'డిస్కోరాజా' రేపు విడుదల కానుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆయన సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటించడం మరో విశేషం.

రవితేజ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అందువలన భారీస్థాయిలో విడుదల చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. కానీ ఒక వైపున 'సరిలేరు నీకెవ్వరు'..'మరో వైపున 'అల వైకుంఠపురములో' సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అందువలన ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరక్కపోవడం 'డిస్కోరాజా'ను టెన్షన్ పెడుతున్నట్టుగా సమాచారం. ఈ వీకెండ్ లో కొన్ని థియేటర్స్ నుంచి 'దర్బార్'ను .. మరికొన్ని థియేటర్స్ నుంచి 'ఎంత మంచి వాడవురా'ను తీసేయనున్నారు. ఆ థియేటర్స్ మాత్రమే 'డిస్కోరాజా'కి దొరికాయట.
Raviteja
Nabha
Payal
Thanya

More Telugu News