నైజామ్ లో కొత్త రికార్డును నమోదు చేసిన బన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నైజామ్ లో కొత్త రికార్డును నమోదు చేసిన బన్నీ

  • ఈ నెల 12న వచ్చిన 'అల వైకుంఠపురములో'
  • తొలివారంలో 180 కోట్ల గ్రాస్ 
  • నైజామ్ లో 30 కోట్లకి పైగా వసూళ్లు
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' రూపొందనుంది అనగానే, ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ కొడతారా? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన 'జులాయి'..' సన్నాఫ్ సత్యమూర్తి' భారీ విజయాలను సాధించడమే అందుకు కారణం. అయితే అభిమానులు కోరుకున్నట్టుగానే 'అల వైకుంఠపురములో' సినిమాతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయ విహారం చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక నైజామ్ లో 8 రోజుల్లో ఈ సినిమా 31.86 కోట్లను సాధించింది. అల్లు అర్జున్ కెరియర్లో అత్యంత వేగంగా 30 కోట్లను రాబట్టిన చిత్రంగా 'అల వైకుంఠపురములో' ఒక కొత్త రికార్డును ఇచ్చింది. త్రివిక్రమ్ కథనం .. అల్లు అర్జున్ నటన ప్లస్ డాన్స్ .. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ బాణీలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో కీలకమైన పాత్రలను పోషించాయని అంటున్నారు.
Allu Arjun
Pooja Hegde
Tabu

More Telugu News