నిర్భయ దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమన్న ఢిల్లీ ప్రభుత్వం!
- రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన దోషి ముఖేశ్ సింగ్
- రాష్ట్రపతి నిర్ణయం వచ్చేవరకు ఉరి నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
- నిస్సహాయత వ్యక్తం చేసిన ఢిల్లీ సర్కారు
ఈ నేపథ్యంలో, తాము జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. రాష్ట్రపతి నిర్ణయం రాకముందే ఉరి అమలు చేయడం జైలు నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. మరోవైపు, తీహార్ జైలు అధికారులు కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినా జైలు నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.