జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకపై ప్రశ్నకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకపై ప్రశ్నకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కాకినాడలో గాయపడ్డ తమ కార్యకర్తలకు పవన్ పరామర్శ
  • అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు
  • ‘మీరు ఏం చెప్పినా రాపాక కౌంటర్ ఇస్తున్నారు?’ అని ప్రశ్నించిన మీడియా
కాకినాడలో గాయపడ్డ తమ కార్యకర్తలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి ఆయన్ని ప్రశ్నించారు. ‘మీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీరు ఏం చెప్పినా దానికి కౌంటర్ ఇస్తున్నారు?’ అని పవన్ ని ప్రశ్నించగా, ‘పాపం, ఆయనకు ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పలేం కదా..’ అని సమాధానమిచ్చారు.
Pawan Kalyan
janasena
Rapaka Vara Prasad
mla

More Telugu News