బాబాయ్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నాను: హీరో కల్యాణ్ రామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబాయ్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నాను: హీరో కల్యాణ్ రామ్

  • 'మనం' చూశాక అలా అనిపించింది
  • నా డ్రీమ్ ప్రాజెక్టు అదే 
  • బాబాయ్ ఆ మాట చెప్పారు  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 'మనం' సినిమా చూసినప్పుడు 'అరె ఈ కథ మనకు రాలేదే అనిపించింది. మా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో సినిమా చేయాలనిపించింది. బాబాయ్ .. ఎన్టీఆర్ .. నేను కలిసి ఒక సినిమా చేస్తే బాగుండుననిపించింది. నిజం చెప్పాలంటే అదే నా డ్రీమ్ ప్రాజెక్టు.

మా బాబాయ్ సపోర్ట్ నాకు మొదటి నుంచి వుంది. ఏ సీన్ అయినా టేక్ వన్ లోనే చేసేయాలి .. టేక్ టూ లోనే చేసేయాలి అనేవి పెట్టుకోకు. నీ మనసుకు నచ్చేంతవరకూ చేస్తూనే వుండు. చుట్టూ ఎంతమంది పబ్లిక్ వున్నా .. గొప్ప ఆర్టిస్టుల కాంబినేషన్ అయినా .. ఎవరు చూస్తున్నా నువ్వు సంతృప్తి చెందేవరకూ చేస్తూనే వుండు అని చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Kalyan Ram
Ali

More Telugu News