పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో కూడా వుంటే తప్పేంటి?: రాపాక
- రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు
- పవన్ నిర్ణయంతో తనకు సంబంధంలేదని వెల్లడి
- పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమంటూ వ్యాఖ్యలు
పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చిరంజీవి సైతం మూడు రాజధానులను సమర్థించారని, పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించడంలేదని తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయమని అడుగుతున్నారని వివరించారు. పార్టీ అధినేతగా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది పవనే అని, కానీ తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమని అన్నారు.