నాకు గుడి కట్టిన విషయం ఆలస్యంగా తెలిసింది: ఖుష్బూ
Add ap7am to your home Screen

నాకు గుడి కట్టిన విషయం ఆలస్యంగా తెలిసింది: ఖుష్బూ

  • 'చిన్నతంబి'తో క్రేజ్ పెరిగింది 
  • పాలాభిషేకాలు చేయడం నాకు ఇష్టం ఉండదు 
  • ఫ్యాన్స్ తమ డబ్బు వృథా చేయడం నచ్చదన్న ఖుష్బూ
తమిళనాట అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కథానాయికల జాబితాలో ఖుష్బూ ఒకరుగా కనిపిస్తారు. చాలాకాలం క్రితం ఆమెకి అక్కడ అభిమానులు 'గుడి' కట్టారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. తమిళంలో ప్రభు జోడీగా నేను 'చిన్నతంబి' (చంటి) చేశాను. ఆ సినిమా తరువాత అభిమానులు నాకు 'తిరుచ్చి'లో 'గుడి' కట్టారు.

అప్పట్లో నాకు దిన పత్రిక చూసే సమయం కూడా ఉండేది కాదు. అందువలన ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. అందువలన ఆ విషయంపై నేను రియాక్ట్ కాలేదు. నన్ను అంతగా అభిమానిస్తున్నారనే విషయం నా బాధ్యతను మరింత పెంచింది. నిజానికి అభిమానులను ఇంటిముందు వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు. అలాగే నా కటౌట్ లకు పాలాభిషేకాలు చేయడం .. తెరపైకి డబ్బులు విసరడం నాకు నచ్చదు. వాళ్లు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే మాత్రం నాకు సంతోషం కలుగుతుంది" అని చెప్పుకొచ్చారు.
Khushbu
Ali

More Telugu News