అలా అడగడంతో అమితాబ్ నన్ను కొడతానన్నారు: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ
- నేను పుట్టిపెరిగింది ముంబైలో
- చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాను
- 200పైగా సినిమాలు చేశానన్న ఖుష్బూ
ఊహతెలిసిన దగ్గర నుంచి అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం. బాల నటిగా అమితాబ్ సినిమాల్లో నటించాను. 'నసీబ్'.. 'దేశ్ ప్రేమి' .. 'కాళియా' .. 'లావారీస్' మొదలైన చిత్రాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కొంతకాలానికి అమితాబ్ గారు కలిస్తే, ఆయనతో కలిసి ఒక డ్యూయెట్లో కనిపించాలని ఉందని చెప్పాను. అలాంటి కోరిక కోరితే, కొడతానంటూ చేయి చూపించారు. 'సెట్లో నా కూతురుతోపాటు నిన్ను చూసుకున్నాను. అందువలన నాతో నువ్వు డ్యూయెట్లు పాడాలనుకోకూడదు' అని అన్నారంటూ చెప్పుకొచ్చారు.