Rasi Khanna: ఆనందంతో పొంగిపోతున్న రాశి ఖన్నా

షార్ట్స్‌లో చూడండి
తెలుగులోని అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. నిదానంగా ఒక్కో హిట్ ను తన ఖాతాలో వేసుకు వెళుతున్న రాశి ఖన్నా, తాజాగా 'ప్రతిరోజూ పండగే' సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లతో ముందుకు వెళుతోంది.

ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుండటం పట్ల రాశి ఖన్నా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సినిమాలో తను పోషించిన ఏంజిల్ ఆర్ణా పాత్ర జనంలోకి బాగా వెళ్లిందనీ, ప్రస్తుతం తను ఎక్కడికి వెళ్లినా అంతా ఏంజిల్ ఆర్ణా అనే పిలుస్తున్నారని అంటోంది. పల్లెటూరి అమ్మాయిగా తనని తాను తెరపై చూసుకోవడం థ్రిల్లింగ్ గా ఉందనీ, ఈ పాత్ర తనకి తెచ్చిపెట్టిన పేరు ఎంతో ఆనందాన్నిస్తోందని చెబుతోంది. తనకి ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు తెలిపింది.
Go Back to Shorts
Rasi Khanna
Sai tej

More Telugu News