ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని అన్నకు తమ్ముడి ఓదార్పు!

  • కోల్ కతాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం 
  • అమ్ముడుపోని యూసుఫ్ పఠాన్
  • నువ్వు మ్యాచ్ విన్నర్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం నిన్న కోల్ కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో కొందరు ఆటగాళ్లు ఎవరికీ అమ్ముడుపోక ఉసూరుమన్నారు. అలాంటివారిలో యూసుఫ్ పఠాన్ ఒకడు. ఒకప్పుడు గొప్ప హార్డ్ హిట్టర్ గా పేరుగాంచిన యూసుఫ్ కాలక్రమంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో, గత ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అతడ్ని వదిలించుకుంది.

తాజాగా నిర్వహించిన వేలంలో యూసుఫ్ పఠాన్ వైపు ఒక్క ఫ్రాంచైజీ కూడా మొగ్గు చూపలేదు. అతడి కనీసధర రూ.1 కోటి. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకున్నాడు. దీనిపై యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. తన అన్న పరిస్థితిని ఊహించి ఊరట వచనాలు పలికాడు. ఇలాంటి చిన్న అంశాలతో నీ కెరీర్ ను తక్కువచేసి చూడలేం. నువ్వో రియల్ మ్యాచ్ విన్నర్ వి. లాలా, నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. అంటూ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
IPL
Cricket
Yusuf Pathan

More Telugu News