23 లక్షల్లో తీసిన 'ఖైదీ' .. కొన్ని కోట్లు వసూలు చేసింది: దర్శకుడు కోదండరామిరెడ్డి
- 'అభిలాష' భారీ విజయాన్ని అందుకుంది
- నిర్మాతలకి నాపై నమ్మకం పెరిగింది
- చిరంజీవి లుక్ బాగా వచ్చిందన్న కోదండరామిరెడ్డి
చివరికి 'రాంబో' ఫస్టు బ్లడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నాము. ఆ సినిమాలోని రెండు మూడు సీన్లను తీసుకుని డెవలప్ చేద్దామని భావించాము. తర్జన భర్జనలుపడి ఫ్లాష్ బ్యాక్ ను ఓకే చేసుకున్నాము. చిరంజీవికి అనుకున్న గెటప్ బాగా సెట్ కావడంతో, మాకు ఆ కథపై నమ్మకం పెరుగుతూ వచ్చింది. పాటలు మినహా 30 రోజుల్లో షూటింగును పూర్తిచేశాము. మొత్తంగా 23 లక్షలు ఖర్చుకాగా కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసింది. దర్శకుడిగా ఈ సినిమా నా స్థాయిని పెంచింది" అని చెప్పుకొచ్చారు.