సాయుధ దళాలకు, అమరవీరుల నిలువెత్తు స్ఫూర్తికి శిరసు వంచి వందనం చేస్తున్నా: నారా లోకేశ్
- 1971లో భారత్, పాక్ యుద్ధం
- డిసెంబరు 16న పాక్ ఓటమి
- ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
"48 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఇండో-పాక్ యుద్ధంలో భారత్ గెలిచింది. సాయుధ దళాల తెగువ, శౌర్యం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితమే ఆ యుద్ధంలో మనకు విజయం లభించింది. ఈ విజయ దినోత్సవం నాడు ఎవరికీ తలొగ్గని భారత సైన్యం స్ఫూర్తికి శిరసు వంచి వందనం చేస్తున్నా" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.