అబ్దుల్లాపూర్ మెట్ లో కలకలం.. మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం
- ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించిన వ్యక్తి
- అందులో పుర్రె, శరీర భాగాలు
- మృతురాలి వయసు 25 నుంచి 30 మధ్య ఉంటుందని పోలీసుల అంచనా
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీమ్‌తో వచ్చి తనిఖీలు చేశారు. పుర్రె, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కాగా, మహుబూబ్ నగర్ జిల్లా నుంచి 8 నెలల క్రితం ఇసుక డంప్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.